Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు సంక్షేమ నిధికి తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు లక్ష రూపాయల విరాళం

Webdunia
సోమవారం, 4 మే 2020 (21:01 IST)
విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తెలుగుదేశం సీనియర్ నేత కాట్రగడ్డ బాబు విరాళం అందించారు. విధి నిర్వహణలో పలువురు పోలీసు సిబ్బంది సైతం కరోనా బారిన పడుతుండగా, వారి కుటుంబాలను ఆదుకునే క్రమంలో కాట్రగడ్డ లక్ష రూపాయలను పోలీసు శాఖకు అందించారు. 
 
విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ పోలీసు కమీషనరేట్ పరిపాలనా విభాగాపు డీసీపీ మేరీ ప్రశాంతికి లక్ష రూపాయల చెక్‌ను కాట్రగడ్డ బాబు అందచేశారు. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్న క్రమంలో వ్యక్తిగతంగా కాట్రగడ్డ లక్ష రూపాయలను పోలీసుల సంక్షేమం కోసం సమకూర్చటం చిన్న విషయం కాదని ఈ సందర్భంగా పోలీసు వర్గాలు అభిప్రాయపడ్డాయి. 
 
కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడే యోధులుగా పోలీసులు పని చేస్తున్నందున తనవంతు బాద్యతగా వారికి ఆర్ధిక సాయం చేసినట్లు బాబు తెలిపారు. విజయవాడ నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని కాట్రగడ్డ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments