నిర్మల్ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకున్న ఆంబులెన్స్ డ్రైవర్‌కి ఛాతిలో నొప్పి..?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (11:51 IST)
కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తెలంగాణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ జిల్లా కుంటాల పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్‌లో 108 ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 42 సంవత్సరాల విఠల్ అనే వ్యక్తి 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు కరోనా టీకా తీసుకున్నారు. 
 
అయితే, 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (20వ తేదీ) 2.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో అతడిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. కానీ అతడు అప్పటికే చనిపోయినట్టు జిల్లా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
 
అయితే, కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది. గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. జిల్లా ఏఈఎఫ్ఐ కమిటీ పరీక్షించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments