Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచ‌కులు, బైరాగుల‌కు క‌రోనా వాక్సినేష‌న్!

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (14:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గోదావారి తీరంలో యాచ‌కులు, బైరాగులు ఎక్క‌వ‌గా సంచ‌రిస్తుంటారు. వీరికి ఎలాంటి ఆధార్ కార్డులు, ఆధారం లేని స్థితి. ఇలాంటి వారికి క‌రోనా వ్యాక్సిన్ వేయించే ప‌నిపెట్టుకుంది... రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి.
 
రాజమహేంద్రవరంలోని నిరాశ్రయులు, యాచకులు, సాధువులకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఉచితంగా రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమీ జీవ కారుణ్య సంఘం వేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్. వైద్య అధికారిని విన్నూత్న ఇందులో పాల్గొన్నారు.

టీకే విశ్వేశ్వరరెడ్డి నిరాశ్రయులు, యాచకులు, సాధువులకు కోవిడ్ టీకాలు వేయించడం గొప్ప విశేషంగా కొనియాడారు. ఇప్పుడు వేయించుకున్న అనాధలకు యాచకులకు సాధువులకు రెండు నెలల పోయిన తరువాత రెండవ డోసు వ్యాక్సినేషన్ వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ లాయర్ మద్దూరి శివ సుబ్బారావు వ్యాక్సినేషన్ వేయించుకున్న అనాధలకు, యాచకులకు, సాధువులకు మాస్కులు పంచిపెట్టారు.

గోదావరి ఒడ్డున నిరాశ్రయులు, యాచకులు, సాధువులను ఒక చోటకు చేర్చి కోవిడ్ వాక్సినేషన్ వేయించడం మానవతా విలువలకు అద్దం పట్టిందని అన్నారు. రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఏ విధమైన ఆధారం లేనివారికి  కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తే వ్యాప్తి జరగకుండా ఉంటుంది అని అన్నారు.

వ్యాక్సినేషన్ అనంతరం అంద‌రికీ గోదావరి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ స్వ‌రూప రెడ్డి భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 120 మందికి యాచకులకు ఉచిత వాక్సినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో లో కళాశాల ఎన్. ఎస్. పివో లు ప్రవీణ, ప్రసాద్, కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments