తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. తెలంగాణలో 162, ఏపీలో 624 కేసులు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (22:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,506 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,67,887కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,930కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 214 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,235 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 38,312 పరీక్షలు నిర్వహించగా.. 624 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,57,252 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా నలుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,254కి చేరింది. 810 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,35,054కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,944 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,44,941 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi and Pawan Kalyan: టీవీకే విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్

PawanKalyan: వాదోపవాదాలకు దారితీసిన పవన్ కళ్యాణ్ బంగారం 20వ వార్షికోత్సవం

Joe Sharma: M4M మూవీలో కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్

రీల్స్ తో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ రణబాలి నుంచి ఏందయ్య సామీ.. సాంగ్

Dalapati Vijay : దళపతి విజయ్ కు టాలీవుడ్ యూత్ హీరోలు ప్రశసంలు -త్రిషకు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

తర్వాతి కథనం
Show comments