Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా అప్డేట్.. తెలంగాణలో కొత్తగా 298 పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (11:18 IST)
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు.

మరో 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 228 మంది మరణించారు. కొత్తగా 19,253 మంది ప్రాణాంతక వైరస్‌ నుంచి కోలుకున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8గంటల వరకు 31,187 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 298 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,563కి చేరింది. 
 
కరోనా బారి నుంచి శుక్రవారం 474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,048కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,822 ఉండగా వీరిలో 2,614 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 72,15,785కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments