Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు.. లండన్‌ నుంచి అలా ఒంగోలుకు..

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (10:29 IST)
రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఈనెల 12న లండన్‌ నుంచి బయలుదేరిన ఆయన 15న ఒంగోలు చేరుకున్నారు.
 
 జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చేశారు. వెంటనే శాంపిల్స్‌ తీసుకున్న వైద్యులు తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బుధవారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది.
 
బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. రాష్ట్రంలో మరో పాజిటివ్‌ కేసు నమోదవడంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు ఒంగోలు ప్రభుత్వాస్పత్రి వైద్యులను అలెర్ట్‌ చేశారు. 
 
ఇప్పటికే నెల్లూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదవగా బాధితుడికి అక్కడి ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బుధవారం మరో ముగ్గురు అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 105 మంది శాంపిల్స్‌ పరిశీలించగా 96 నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. రెండు పాజిటివ్‌ రాగా, మరో ఏడుగురి రిపోర్టు రావాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రానికి మిగిలిన కేసులకు సంబంధించిన రిపోర్టులు రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments