తెలంగాణాలో ఆరో కరోనా వైరస్ కేసు... గాంధీ ఆస్పత్రిలో చికిత్స

బుధవారం, 18 మార్చి 2020 (15:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. బుధవారం మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరింది. 
 
బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని వచ్చిందని వైద్యులు ప్రకటించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రస్తుతం ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఒకరికి గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేసి డిశ్చార్జ్‌ చేశారు.
 
విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనపడితే వెంటనే ఐసోలేషన్ వార్డులు తరలించి, నమూనాలను పూణెకు పంపుతున్నారు. కరోనా సోకిందని తేలితే వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలంగాణలో మరొకరికి కరోనా పాజిటివ్, దేశంలో 147 మంది, కేంద్రం షరతులు