Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:14 IST)
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది సెలెబ్రిటీలను పొట్టనబెట్టుకుంటోంది. గత యేడాది కాలంగా ఈ మరణమృదంగం కొనసాగుతూనే వుంది. ఇందులో అనేక మంది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌ు కూడా ఉన్నారు. తాజ‌గా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్(66) కరోనాతో క‌న్నుమూశారు.
 
దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్‌కు (నదీమ్‌ - శ్రావణ్ ) కొద్ది రోజుల క్రితం క‌రోనా సోక‌గా, ఆయ‌నకు ముంబైలోని ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తూ వ‌చ్చారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని శ్రావ‌ణ్ కుమారుడు, మ్యూజిక్ కంపోజ‌ర్ సంజీవ్ రాథోడ్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు.
 
దీర్ఘకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్‌ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని ఈ క్ర‌మంలోనే ఆయ‌న మృత్యువాత ప‌డ్డాడ‌ని తెలుస్తుంది. శ్రావ‌ణ్ మృతిని మ్యూజిక్ కంపోజ‌ర్ న‌దీమ్ సైఫీ క‌న్‌ఫాం చేశారు. శ్రావ‌ణ్ మృతిని జీర్ణించుకోలేని బాలీవుడ్ ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేసింది. 
 
కాగా ఆషిఖీ, సాజన్‌, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్‌-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments