Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరిగించిన వెండిని తాగిన మాతాజీ.. ప్రాణాలు కోల్పోయినా..?

Webdunia
సోమవారం, 10 మే 2021 (13:30 IST)
కరోనా కాలంలో మూఢనమ్మకాలతో కన్నుమూసే వారి సంఖ్య కూడా కాస్త పెరుగుతుందనే చెప్పాలి. ఇటీవల ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదని నమ్మి ఓ టీచర్ తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇది మరువక ముందే.. అలాంటి దారుణం మరొకటి జరిగింది. కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదని నమ్మి.. కరిగించిన వెండిని తాగి ఓ మాతాజీ మరణించిన ఘటన అమెరికాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. కొలరాడోకు చెందిన అమి కార్లసన్ (45) అనే మహిళ 'లవ్ హాస్ ఓన్' అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది. శిష్యులందరూ ఆమెను ''మదర్‌ ఆఫ్‌ గాడ్‌'' అని పిలుస్తారు. కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది.
 
దీంతో కార్లసన్ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఇంట్లో దాదాపు 10మంది వరకు శిష్యులున్నారు. కార్లసన్‌ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి, బాక్సులో పెట్టి ఉంది. దాని చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించి.. భజనలు, పూజలు చేస్తున్నారు. 
 
అది గమనించిన పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేమాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టంలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
 
కార్లసన్ ఈ యేడాది మార్చిలోనే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. అంతేకాదు ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments