Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై ఎన్నో పరిశోధనలు చేస్తుంది.. వ్యూహాన్ ల్యాబ్‌కు నోబెల్ ఇవ్వాలట..!

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (13:45 IST)
కోవిడ్ మహమ్మారి చైనా నుంచి పుట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను చెరిపేందుకు డ్రాగన్ కంట్రీ కసరత్తు చేస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా వుహాన్‌ ల్యాబ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 
 
డ్రాగన్‌ దేశం వుహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించి.. ప్రపంచం మీదకు వదిలిందిని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఓ వింత ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్‌ ల్యాబ్‌ ఎన్నో పరిశోధనలు చేస్తుందని.. దీన్ని పరిగణలోకి తీసుకుని.. వుహాన్‌ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.
 
ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జౌ లిజియాన్‌ మాట్లాడుతూ.. ''కరోనా వైరస్‌ అధ్యయనంలో వుహాన్‌ ల్యాబ్‌ కృషిని గుర్తిస్తూ మెడిసిన్‌ విభాగంలో నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలి'' అని డిమాండ్‌ చేశారు. 
 
ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్‌ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్‌ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్‌ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్‌ ల్యాబ్‌ చేసిన కృషికి గాను చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ దానికి అవుట్‌స్టాండింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అచీవ్‌మెంట్‌ ప్రైజ్‌ 2021ని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments