Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్-19 డెల్టా ప్లస్ కొత్త వేరియంట్: 9 దేశాలలో గుర్తింపు

Advertiesment
కోవిడ్-19 డెల్టా ప్లస్ కొత్త వేరియంట్: 9 దేశాలలో గుర్తింపు
, గురువారం, 24 జూన్ 2021 (20:06 IST)
Delta Virus
కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ వినాశనం తర్వాత కోవిడ్-19 డెల్టా ప్లస్ కొత్త వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలను పెంచుతుంది. భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్ ప్రపంచంలోని మరో తొమ్మది దేశాలలో కూడా కనిపిస్తోంది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్, B.617.2గా గుర్తించగా.. అదే ఉత్పరివర్తనంగా మారింది. డెల్టా ప్లస్ లేదా AY.1 గా రూపాంతరం చెందింది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో కనుగొనబడింది. దీని కారణంగా వైద్య నిపుణుల ఆందోళన పెరుగుతోంది.
 
డెల్టా వేరియంట్ స్పైక్‌కు K417N మ్యుటేషన్ అదనంగా డెల్టా ప్లస్ వేరియంట్‌కు కారణమవుతుంది. అది K417N డి. ఆఫ్రికాలో లభించే కరోనా వైరస్ బీటా వేరియంట్ మరియు బ్రెజిల్‌లో కనిపించే గామా వేరియంట్‌లో కూడా ఇది కనుగొనబడింది. శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా నిరంతరం దీనిని పర్యవేక్షిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం త్వరలో బయటకు రావచ్చు.
 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ భారతదేశంతో పాటు 9 దేశాలలో కనుగొనబడింది. అమెరికా, UK, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాల్లో ఈ వేరియంట్ కనిపించింది. డెల్టా వేరియంట్ మాత్రం భారతదేశంతో సహా ప్రపంచంలోని 80 దేశాలలో కనుగొనబడింది. ఈ డెల్టా వేరియంట్ భారతదేశంలో సెకండ్ వేవ్ కరోనాకు కారణం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీం ఆదేశాల ప్రకారం జూలై 31లోపు అది కుదరదు.. విద్యాశాఖ