చైనాలో కొత్తగా మంకీ బి వైరస్, ఒకరు మృతి

Webdunia
శనివారం, 17 జులై 2021 (20:52 IST)
కరోనా వైరస్ కి పుట్టిల్లు అని చెప్పుకునే చైనా నుంచి మరో కొత్త వైరస్. అదే మంకీ బి వైరస్. బీజింగ్ కేంద్రంగా మొట్టమొదటి మానవ సంక్రమణ కేసు మంకీ బి వైరస్ (బివి) నిర్ధారించబడింది. ఈ వైరస్ కారణంగా ఆ వ్యక్తి మరణించింది. కానీ అతడితో సన్నిహితంగా మెలిగినవారు ప్రస్తుతానికి దాని నుండి సురక్షితంగా ఉన్నారు.
 
మానవులేతర జీవులపై పరిశోధన చేసే సంస్థలో పనిచేస్తున్న 53 ఏళ్ల పురుషుడు, వికారం మరియు వాంతులతో అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ సమస్యలతో అతడు చనిపోయాడు. ఐతే మార్చి ప్రారంభంలో చనిపోయిన రెండు కోతులను పరీక్షించినప్పుడు అతడికి కోతులకు సోకిన వైరస్ కారణంగా చనిపోయినట్లు నిర్థారణ అయ్యింది.
 
ఈ పశువైద్యుడు అనేక ఆసుపత్రులలో చికిత్స పొందాడు, చివరికి మే 27న మరణించాడు. చైనాలో ఇంతకుముందు ప్రాణాంతకమైన లేదా వైద్యపరంగా స్పష్టంగా కనిపించే బివి ఇన్ఫెక్షన్లు లేవని, అందువల్ల చైనాలో గుర్తించిన బివితో మొదటి మానవ సంక్రమణ కేసును సూచిస్తుంది.
 
పరిశోధకులు ఏప్రిల్‌లో పశువైద్యుని యొక్క సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించి, అతన్ని బివికి పాజిటివ్‌గా గుర్తించారు.ఈ వైరస్ ప్రత్యక్ష సంపర్కం లేదా శారీరక స్రావాల మార్పిడి ద్వారా వ్యాపిస్తుందని తేల్చారు. ఈ వైరస్ కారణంగా కోతుల్లో మరణాల రేటు 70 శాతం నుండి 80 శాతం వరకు ఉంటుంది. కోతులలోని బివి వృత్తి కార్మికులకు ముప్పు కలిగించవచ్చని జర్నల్ సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments