Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను అంటించి.. రిలాక్స్ అయిన చైనా.. థియేటర్స్ ఓపెన్

Webdunia
గురువారం, 16 జులై 2020 (17:27 IST)
కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించిన చైనా ప్రస్తుతం కోవిడ్ నుంచి తప్పించుకుని.. యధావిధిగా జీవనాన్ని సాగిస్తోంది. పచ్చి మాంసాన్ని ఇట్టే లాగిస్తూ.. ఆహారం విషయంలో గాడితప్పిన చైనా వల్ల కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాల్లో భారీగా ప్రాణ నష్టాలు వాటిల్లాయి. ఇంకా కరోనా వైరస్ కారణంగా జనాలు జడుసుకుంటున్నారు. 
 
ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. లాక్ డౌన్, మాస్క్‌లు వంటి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ప్రపంచ దేశాలను కరోనా వదిలిపెట్టట్లేదు. ఇలా ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో నానా తంటాలు పడుతుంటే.. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో యధావిధిగా ప్రజా జీవనం ప్రారంభం కానుంది. ఈ మేరకు చైనాలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 
 
జూలై 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా అనుమతులు జారీ చేసింది. అయితే కరోనా వ్యాప్తి పూర్తిగా తొలగిపోని కారణంగా ప్రేక్షకుల క్షేమం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్ల పూర్తి సామర్థ్యంలో కేవలం 30 శాతం మందిని మాత్రమే హాల్‌లోకి అనుమతించాలని థియేటర్ల యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
 
అలాగే ప్రేక్షకుల మధ్య కొన్ని సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా సూచించింది. ఇక సినిమా చూడాలనుకునే వారు ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రేక్షకులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని చైనా ప్రభుత్వం సూచించింది. కరోనా దెబ్బకు అల్లాడుతున్న సినిమా రంగాన్ని ఆదుకునేందుకే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదీ లో రిస్క్ ప్రాంతాల్లోనే ఈ థియేటర్లను ఓపెన్ చేయనున్నట్లు చైనా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments