Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్ టైమ్‌లో వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (13:54 IST)
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 29 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఓ వదంతు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
మహిళలు నెలసరికి ఐదు రోజుల ముందు.. ఐదు రోజుల తర్వాత టీకా వేయించుకోవద్దనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య వైరల్‌గా మారింది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని వీటిని నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. మహిళలు దీన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.
 
ప్రభుత్వంతో పాటు పలువురు వైద్యులు, వైద్య నిపుణులు ఈ దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. 18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments