Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతలేని వ్యక్తులు ఇలానే మాట్లాడుతారు : ప్రియాంకా గాంధీ

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (13:24 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. సున్నితమైన సమస్యపై సీఎం యోగి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రుల్లో చేర్చుకోలేమంటూ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో... కరోనా పేషెంట్ల కుటుంబీకులు పడుతున్న ఆవేదన యోగికి తెలియడం లేదని దెప్పిపొడిచారు. 
 
కరోనా బాధితుల స్థానంలో ఉండి ఆలోచన చేయాలని యోగికి సూచించారు. బాధ్యత లేని ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాయని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి యూపీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ప్రియాంక చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలను చేసినందుకు తమరు తనపై కేసులు పెట్టాలనుకుంటే... తన ఆస్తులను సీజ్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న విషమ పరిస్థితులను సీఎం అర్థం చేసుకోవాలని... ఒక మెట్టు కిందకు దిగి, పేషెంట్ల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆమె స్పందించారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments