Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగుల వార్డుల్లోకి నేరుగా వెళ్ళిపోయిన మంత్రి, ఎప్పుడు, ఎక్కడ?

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (18:47 IST)
సాధారణంగా కరోనావైరస్ రోగులు ఉండే ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. కేవలం వైద్య సిబ్బంది మాత్రమే వెళుతుంటారు. వారు కూడా పిపిఈ కిట్లు వేసుకుని అతి జాగ్రత్తగా వెళుతుంటారు. కానీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని మాత్రం ప్రభుత్వ అధికారులకు చెప్పకుండా ఉన్నట్లుండి కరోనా బాధితుల వార్డుల్లోకి వెళ్ళారు. దీన్ని చూసిన వైద్య సిబ్బందే ఆశ్చర్యపోయారు.
 
తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి ఆళ్ళ నాని. ఆయన పర్యటన ప్రకారం స్విమ్స్  ఆసుపత్రిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితులతో మాట్లాడాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆయన కరోనా రోగుల వార్డుల్లోకి నేరుగా వెళ్ళిపోయారు.
 
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తను వెంట తీసుకుని మరీ వెళ్ళారు మంత్రి ఆళ్ళ నాని. కరోనా రోగులతో స్వయంగా మాట్లాడారు. ఎలాంటి సౌకర్యాలు ఆసుపత్రిలో అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైద్యసదుపాయాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. ఎపిలో కరోనా రోగుల కోసం 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. కరోనా వైరస్ తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments