Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 8 నుంచి హోటల్స్ - రెస్టారెంట్లు : మంత్రి అవంతి

ఏపీలో 8 నుంచి హోటల్స్ - రెస్టారెంట్లు : మంత్రి అవంతి
, గురువారం, 4 జూన్ 2020 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. లాక్డౌన్ కారణంగా గత 70 రోజులుగా మాతపడిన హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర విడుదల చేసిన మార్గదర్శకాలకు లోబడి తెరుచుకునేందుకు అనుమతి ఇస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 
 
ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు గురువారం హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణ చర్యలు పాటిస్తూ హోటళ్ల నిర్వహణ అంశాలపై యాజమాన్యాలతో చర్చలు జరిపారు. 
 
ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించవచ్చు. ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. 
 
అలాగే, పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించాం.
 
పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం. అరకు, గండికోట, హర్సలీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. లాక్డౌన్ సమయంలో నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్టు మంత్రి శ్రీనివాస్ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త హత్యకు భార్య పక్కా స్కెచ్.. తెలియగానే పరార్