Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చిలు - మసీదులు కోవిడ్ కేర్ సెంటర్లకు పనికిరావా?

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. దీంతో ప్రభుత్వం కరోనా రోగులను ఆదుకునేందుకు అనేక ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను నెలకొల్పుతోంది. ఇందులోభాగంగా, పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలకు చెందిన వసతి గృహాలను సైతం కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. కానీ, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క మసీదు లేదా చర్చిమాత్రం కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్ కేర్ సెంటర్‌లు‌గా హిందూ ఆలయాలుతో పాటు ఇతరులవి ఎందుకు వాడుకోరు అని ప్రశ్నించారు. 'ఈ కపట ప్రేమ ఎందుకు! దీనినే చౌకబారు రాజకీయం అంటారు! సీఎం జగన్‌ గారు, అన్ని మతాలలో కరోనా బాధితులు వున్నారు! వారి ప్రధానాలయాలను తీసుకోండి! కేవలం హిందూ ఆలయాలు మాత్రమే అంటే నిర్ద్వందంగా ఎండగట్టుతాము!' అని స్పష్టం చేశారు. 
 
కాగా, ఇప్పటికే హిందూ ఆలయాల వసతి గృహాలు కోవిడ్ కేర్‌ సెంటర్లుగా అద్భుతమైన సేవాలు అందిస్తున్నాయని...మరి ఒక్కటంటే ఒకటి ఇతరులవి ఏర్పాటు చెయ్యలేక పోతున్నారని మండిపడ్డారు. కారణం ప్రశ్నించేవారు లేరనా? లేక అన్నింటికి తలూపే దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారనా అంటూ రమేష్ నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments