Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు దందా కేసులో చోటా రాజన్ మేనకోడలి అరెస్టు

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:34 IST)
అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఈ పేరు వింటే ఒకపుడు ముంబై నగరం వణికిపోయేది. అలాంటి చోటా రాజన్ ఇటీవల కరోనా కాటుకు బలయ్యాడు. ఆయన మృతితో వీడి విరగడైందని ముంబై వాసులు భావించారు. కానీ, చోటా రాజన్ మేనకోడలు ప్రియదర్శిని ప్రకాశ్ నికల్జే (36) పేరుతో మరో లేడీ డాన్ పుట్టుకొచ్చారు. ఆమె బెదిరించి డబ్బులు వసూలు చేసే దందాకు శ్రీకారం చుట్టారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అంతే.. రంగంలోకి దిగిన పూణె పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేశారు. 
 
నగరంలోని వనోవ్రీ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించినట్టు డీసీపీ (క్రైమ్) శ్రీనివాస్ ఘడగే తెలిపారు. స్థానిక బిల్డర్ రాజేశ్ జవ్‌లేకర్‌ను బెదిరించి మార్చి 14న రూ.25 లక్షలు తీసుకుంటూ ధీరజ్ సబ్లే అనే వ్యక్తి పట్టుబడ్డాడు. 
 
ఈ ఘటనలో సబ్లే, నికల్జేలపై కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా ప్రియదర్శిని బెదిరింపులు ఆపలేదు. మరో రూ.50 లక్షలు ఇవ్వకుంటే ప్రాణాలు తీస్తానని జవ్‌లేకర్‌ను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. చోటా రాజన్ పేరుచెప్పి ప్రియదర్శిని డబ్బులు వసూలు చేస్తుండడంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, 2015లో పోలీసులకు చిక్కిన చోటా రాజన్ ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ, ఇటీవలే కొవిడ్ బారినపడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments