Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బారిన చిన్నారులు.. థర్డ్ వేవ్ ముప్పుతో భయం భయం

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:33 IST)
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.
 
కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరిలో కడప జిల్లా చెందిన ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే. 
 
వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇంతమంది పిల్లలు ఆస్పత్రిలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు.
 
ఇక పుత్తూరు పట్టణం పిళ్లారిపట్టులో పదేళ్లలోపు పిల్లలు ఎనిమిది మందికి కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్‌ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments