ఏపీలో కరోనా విజృంభణ.. 2,618 మందికి కోవిడ్.. 16 మంది మృతి

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (17:45 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 88,780 నమూనాలను పరీక్షించగా 2,618 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,25,966కి చేరింది. 
 
ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 16 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 4, చిత్తూరు 3, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,706కి చేరింది.
 
24 గంటల వ్యవధిలో 3,509 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 23,668 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 81,17,685 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరోయిన్ కోసం భార్యను తీవ్రంగా కొట్టిన దర్శకుడు... పూనమ్ కౌర్

Rajendraprasad: లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో పాంచాలి పంచ భర్తృక మూవీ

Santosh Sobhan: సంతోష్ శోభన్, మానస వారణాసి ల ప్రేమ కథగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ

ప్రభాస్ అంటే నాకు క్రష్ ఉండేది.. చికెన్ బిర్యానీని సూపర్‌గా వండుతారు.. మాళవిక మోహనన్

దటీజ్ మెగాస్టార్ క్రేజ్ : అమలాపురంలో ప్రీమియర్ షో తొలి టిక్కెట్ ధర రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments