Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకున్న తర్వాత ఎపుడు రక్తదానం చేయొచ్చు!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (14:20 IST)
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లోభాగంగా, ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ వేశారు. మరికొంతమంది ఈ వ్యాక్సిన్ వేయించుకునేందుకు తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో కరోనా టీకా వేయించుకున్న వారు రక్తదానం చేసే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీకా వేయించుకున్న వారు ఎపుడు రక్తదానం చేయాలన్న అంశంపై నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌బీటీసీ) కీలక సూచనలు చేసింది. 
 
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు రక్తదానం చేయొద్దంటూ ఎన్‌బీటీసీ సూచనలు చేసింది. గతనెల 17న జరిగిన ఎన్‌బీటీసీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ గుప్తా పేర్కొన్నారు. దీనికి సంబంధించి నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసిందని వెల్లడించారు.
 
కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ ఏదైనప్పటికీ.. రెండో డోసు తర్వాత 28 రోజుల వరకు రక్తదానానికి ఆగాల్సిందేనని ఎన్‌బీటీసీ వెల్లడించింది. అంటే తొలి డోసు తీసుకున్న అనంతరం 56 రోజులపాటు (రెండు నెలలపాటు) రక్తదానం చేయొద్దని సూచించింది.
 
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాతే శరీరంలో కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించింది. అలాగే టీకా తీసుకున్న అనంతరం మద్యపానానికి దూరంగా ఉండాలా అనే విషయంలో ఏర్పడిన సందేహాన్ని సైతం ఆరోగ్యశాఖ ఇటీవల నివృత్తి చేసింది. మద్యపానం వల్ల టీకా ప్రభావశీలత తగ్గిందనడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments