Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రాజెనెకా టీకాలా పంది క్లోమం?.. వివరణ ఇచ్చిన ఫార్మా దిగ్గజం

Advertiesment
ఆస్ట్రాజెనెకా టీకాలా పంది క్లోమం?.. వివరణ ఇచ్చిన ఫార్మా దిగ్గజం
, సోమవారం, 22 మార్చి 2021 (10:27 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని కొంతమేరకు నియంత్రించేందుకు వీరుగా పలు ఫార్మా కంపెనీలు టీకాలను అభివృద్ధి చేశాయి. ఈ టీకాలను అభివృద్ధి చేసిన కంపెనీల్లో ఆస్ట్రాజెనెకా ఒకటి. అయితే, ఈ కంపెనీ తయారు చేసిన టీకాలో పంది క్లోమాన్ని వినియోగించినట్టు ఇండోనేషియాలో వార్తలు వచ్చాయి. 
 
ఈ టీకాలో పంది క్లోమంలో ఉండే ట్రిప్సిన్‌ని వినియోగించారని ఆ దేశానికి చెందిన అత్యున్నత ముస్లిం మత సంస్థ ఉలేమా కౌన్సిల్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఈ టీకా వినియోగంపై ఆ దేశంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయినప్పటికీ, ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టీకా వినియోగానికి కౌన్సిల్ అనుమతించింది.
 
దీనిపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా స్పందించింది. ఈ వార్తలను కంపెనీ తోసిపుచ్చింది. పూర్తిగా నిరాధారమైన వార్తగా పేర్కొంది. వ్యాక్సిన్‌ తయారీలో పందికిగానీ లేదా ఇతర ఏ జంతువులతోనైనా సంబంధం ఉన్న పదార్థాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో కరోనా విజృంభణ.. పాఠశాలలు, కాలేజీలు మూతపడుతాయా?