Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... రాజమండ్రి జైల్లో బుసకొట్టిన వైరస్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:18 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలంతా వణికిపోతున్నారు. చివరుక జైల్లో ఉండే ఖైదీలు సైతం ఈ వైరస్ అంటి చచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి జైల్లో ఉన్న ఖైదీల్లో 200 మందికి ఈ వైరస్ సోకింది. ఇదిలావుండగే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది రోగులు సజీవదహనమయ్యారు. 
 
అహ్మదాబాద్‌కు సమీపంలోని నవ్‌రంగ్‌పుర ప్రాంతంలోని షెర్రే హాస్పిటల్‌లో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 8 ఫైర్ ఇంజన్లు, 10 అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోనే అత్యధిక నష్టం సంభవించింది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు సజీవదహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
 
మొత్తం 50 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది రోగులున్నారు. మిగతా వారిని అందరినీ కాపాడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో ఉంది. గ్రామాలకు సైతం వైరస్ విస్తరిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
మరోవైపు జైళ్లలోకి కూడా మహమ్మారి చొచ్చుకుపోతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఖైదీలను, సిబ్బందిని కరోనా బెంబేలెత్తిస్తోంది. కరుడుగట్టిన నేరస్తులను సైతం వణికిస్తోంది. తాజాగా మరో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు 28 మంది ఖైదీలు దీని బారిన పడ్డారు. 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలను నిర్వహించారు. 
 
వీరి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ సాయంత్రానికి టెస్టు రిపోర్టులు రావచ్చని అధికారులు చెపుతున్నారు. మరోవైపు, 200 మంది ఖైదీల వరకు కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సాయంత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments