కరోనా రక్కసికి 798 మంది వైద్యులు బలి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:18 IST)
దేశంలో కరోనా రక్కసికి 798 మంది వైద్యుల్ని బలితీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మంగళవారం అందించిన సమాచారం ప్రకారం... రెండో దశలో ఇప్పటి వరకూ దేశంలో 798 మంది వైద్యులు మరణించారు. అత్యధికంగా ఢిల్లీలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత బీహార్‌లో 115మందిని మహమ్మారి బలితీసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో 79 మంది చనిపోయారు. వీటి తర్వాత స్థానాల్లో బెంగాల్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తృతంగా పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్రాల్లో 23 మంది, 24 మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 
 
పాండిచ్చేరిలో ఒక్కరంటే ఒక్కరే వైద్యులు మృత్యువాత పడ్డారు. కాగా, ఇటీవల మన్‌కీబాత్‌లో పాల్గన్న మోడీ... వైద్యుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జెఎ జయలాల్‌ మాట్లాడుతూ... వైద్యులను గౌరవిస్తామని, రక్షణ కల్పిస్తామని ప్రధాని హమీనిచ్చారని తెలిపారు. కాగా, వైద్యులు చేసిన కృషికి గానూ ప్రతి ఏడాది జులై 1న వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments