Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసట - విపరీతమైన తలనొప్పి - ఆకలి లేకపోవడం.. ఇవి ఉంటే ఖచ్చితంగా స్ట్రెయిన్!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:54 IST)
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకుంది. దీనికి కరోనా స్ట్రెయిన్ అని పేరు పెట్టారు. అయితే, ఇది కరోనా వైరస్ కంటే అతి భయంకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే.. అక్కడకు వెళ్లే విమానాలన్నింటినీ చాలా దేశాలు రద్దు చేశాయి. దాని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్లు పెట్టేస్తున్నారు. 
 
ఇక భారత్‌లోనూ నకర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని సిటీల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఈ రకం కరోనాను గుర్తించడానికి నిర్దిష్టమైన టెస్టుల్లేవు. ఆర్టీపీసీఆర్ టెస్టులే చేసి.. పాజిటివ్ వస్తే దాని జన్యు క్రమాన్ని తేల్చే పనిలో నిపుణులు, శాస్త్రవేత్తలు నిమగ్నమైవున్నారు. 
 
మరి అప్పటివరకు ఈ వైరస్ సోకిందని తెలుసుకునేందుకు కూడా వైద్యులు కొన్ని గుర్తులు చేశారు. కొత్త వైరస్‌తో కలుగుతున్న ఏడు కొత్త లక్షణాలను బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) వెల్లడించింది. ఇప్పటిదాకా జ్వరం, దగ్గు, వాసన పసిగట్టలేకపోవడం, రుచి తెలుసుకోలేకపోవడం వంటివి మాత్రమే కొవిడ్ లక్షణాలని అందరికీ తెలుసు. ఇప్పుడు వాటికి జత కలిసిన కొత్త స్ట్రెయిన్ లక్షణాలివే...
 
అలసట, ఆకలి లేకపోవడం, విపరీతమైన తలనొప్పి, విరేచనాలు, గందరగోళంగా అనిపించడం, కండరాల నొప్పులు ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చెయ్యకుండా వెంటనే టెస్టు చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments