Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ టీకా తీసుకున్న ఏడుగురు మృత్యువాత... రక్తం గడ్డ కట్టడంతో...

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (11:11 IST)
బ్రిటన్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. కరోనా టీకా తీసుకున్న వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ టీకాలు వేయించుకున్న తర్వాత శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. వారికి వేసిన టీకా పేరు ఆస్ట్రాజెనికా. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన టీకా. 
 
నిజానికి ఈ టీకాను బ్రిటన్‌లో ఇప్పటికే 1.8 కోట్ల మందికి వేశారు. అయితే, టీకా తీసుకున్నవారిలో ఏడుగురు వ్యక్తులు రక్తం గడ్డకట్టడం ద్వారా మరణించినట్టు యూకే హెల్త్ రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది. అయితే, ఇది టీకా వలన జరిగిందా మరేదైనా కారణమా అన్నది పూర్తిగా తేలలేదని చెప్పింది.
 
బ్రిటన్‌లోని మెడికల్ అండ్ హెల్త్ రేగులటరీ ఏజన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చెబుతున్నదాని ప్రకారం బ్రిటన్‌లో ఆస్ట్రాజెనికా వాక్సిన్ తీసుకున్న వారిలో 30 మందికి రక్తం గడ్డకట్టినట్టినట్టు గుర్తించారు. సెరిబ్రల్ వెయిన్ థ్రోమ్బోసిస్ లక్షణాలతో 22 మంది, ఇతర రకాలైన థ్రోమ్బోసిస్ తో 8 మంది బాధపడుతున్నట్టు మార్చి 24 వతేదీన గుర్తించారు. దీంతో వివిధ ప్రాంతాల్లో ఆస్ట్రాజెనికా టీకా వినియోగంపై ఆంక్షలు విధించారు.
 
కెనడాలో 55 యేళ్ళలోపు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జెర్మనీలో కూడా 60 సంవత్సరాల లోపు వారికి ఈ టీకా ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. అయితే, బ్రిటన్ మాత్రం ఈ వ్యాక్సిన్ అన్నివయసుల వారికీ సురక్షితం అనే చెబుతోంది.  

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments