Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆరు లక్షల పాజిటివ్ కేసులు - మరో కేంద్ర మంత్రికి కరోనా

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (20:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తూనేవుంది. దీంతో ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కూడా కొత్తగా మరో 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటిపోయింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో 1,383, పశ్చిమగోదావరి జిల్లాలో 1,064 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,177కి చేరుకున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరుకున్నాయి. 5,08,088 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 88,197 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇదిలావుండగా, మరో కేంద్ర మంత్రి కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి కరోనా సోకినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు.
 
తాజాగా మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, రెండు రోజులుగా తనతో మెలిగిన వారు జాగ్రత్తగా ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments