Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా న్యూస్ : ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్...

Webdunia
ఆదివారం, 10 మే 2020 (13:11 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే వుంది. గత 24 గంటల్లో కొత్తగా 3277 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 62939కి చేరాయి. అలాగే, గత 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 2109కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 19,358  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఎయిప్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలెట్లకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వస్తున్నాయి. టేకాఫ్ అయ్యేందుకు 72 గంటల ముందు పలువురు పైలెట్లకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది. 
 
కాగా, చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఎయిర్ ఇండియా అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసింది. ముఖ్యంగా, ప్రపంచ దేశాలకు అవసరమైన హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎయిర్ ఇండియా సరఫరా చేసింది. ఇందుకోసం ఎయిర్ ఇండియా పలు దేశాలకు ప్రత్యేక విమాన సర్వీసులను నడిపింది. 
 
ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఉంటే ఎయిర్ ఇండియా మాత్రం పలు మిషన్లను విజయవంతంగా పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే పలువురు పైలెట్లు కరోనా బాధిత దేశాలకు వెళ్లగా, ఆ సమయంలో ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ సోకిన ఐదుగురు పైలెట్ల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments