Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరోమారు లాక్‌డౌన్ తప్పదా : మంతనాలు జరుపుతున్న మోడీ?

మరోమారు లాక్‌డౌన్ తప్పదా : మంతనాలు జరుపుతున్న మోడీ?
, శనివారం, 9 మే 2020 (10:12 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా, లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత పరిస్థితి మరింత ఎక్కువైంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. అదేసమయంలో మృతుల సంఖ్య కూడా పెరిగింది. 
 
ముఖ్యంగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కేసులు కేంద్రంతో పాటు.. స్థానిక ప్రభుత్వాలను హడలెత్తిస్తోంది. దీనికితోడు మద్యంకోసం మందుబాబులు సామాజిక భౌతిక దూరం మరచి ఎగబడుతున్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 
 
ఈ పరిస్థితిల్లో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులు, నిపుణులు, ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్ 56342కు చేరగా, గత 24 గంటల్లో 3392 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 13 మంది చనిపోగా, మొత్తం చనిపోయిన మృతుల సంఖ్య 1880కు చేరాయి. ఒక్క శుక్రవారమే మహారాష్ట్రలో 1261 కేసులు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి తమిళనాడులోనూ నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 3320 కొత్త కేసులు