Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ కేసుల తాజా పరిస్థితి...

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (09:53 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య రోజుకు 30 వేలకు తగ్గడం లేదు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ మేరకు... గత 24 గంటల్లో 32,080 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,35,850కి చేరింది. ఇక గత 24 గంటల్లో 36,635 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 402 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,41,360కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,15,581 మంది కోలుకున్నారు. 3,78,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటివరకు మొత్తం 14,98,36,767 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం ఒక్కరోజులోనే 10,22,712 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 721 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 753 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,75,261కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,66,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1480కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,661 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 5,576 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 123, రంగారెడ్డి జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments