మహారాష్ట్ర పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా వైరస్

Webdunia
సోమవారం, 11 మే 2020 (17:27 IST)
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ దూకుడు అంతా ఇంతా కాదు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే 30 శాతం కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే, ఆ రాష్ట్ర పోలీసు శాఖను కరోనా వైరస్ వణికిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 221 మంది పోలీసులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో కరోనా వైరస్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 1007కు చేరింది. ఇందులో 106 మంది పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా, ఈ వైరస్ బారినపడి ఏడుగురు పోలీసులు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. 
 
కాగా, మహారాష్ట్రలో ఏకంగా 22 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇదే అత్యధికం. ఒక్క ముంబై మహానగరంలో ఏకంగా 12 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ముంబై తర్వాత పూణె, థానేలలో అత్యధిక కేసులు నమోదైవున్నాయి. అలాగే, మహారాష్ట్రలో ఇప్పటివరకు 832 మంది ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments