Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో 14 నెలల చిన్నారికి జేఎన్ 1 కరోనా...

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:56 IST)
హైదరాబాద్ నగరంలో 14 నెలల చిన్నారికి జేఎన్ 1 కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. నాంపల్లిలోని ఆగాపుర ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి తీవ్రజ్వరంతో పాటు శ్వాస పీల్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు... ఆ చిన్నారి నుంచి శాంపిల్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీంతో ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడానే ఉందని, క్రమంగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. కాగా, ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో చిన్నారి పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడం జరిగిందనీ, ప్రస్తుతం దానిని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం దానిని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మిగతా 19 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. గురువారం వెలుగు చూసిన కొత్త కేసుల్లో నాలుగు హైదరాబాద్‌లో నమోదు కాగా, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments