Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి ముద్ద, బత్తాయి రసం, చికెన్.. ఇవి తిని.. కరోనాను తరిమికొట్టాను: 102 ఏళ్ల బామ్మ!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:33 IST)
ragi-chicken
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో 102 ఏళ్ల వృద్ధురాలు కరోనా వైరస్‌ను జయించింది. అది కూడా డాక్టర్‌ల సమక్షంలో క్వారంటైన్ కేంద్రంలో చికిత్స తీసుకొని కాదండోయ్.. ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుల సూచనలు సలహాలను అమలు పరుస్తూ కోవిడ్ వైరస్ బారి నుంచి బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంకు చెందిన 102 ఏళ్ల సుబ్బమ్మ అనే వృద్ధురాలు... కరోనా పరీక్షలు చేసుకోగా వృద్దురాలితో పాటు నలుగురు కుటుంబ సభ్యులకు పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబీకులు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడారు. 
 
ఈ క్రమంలోనే మిగతా కుటుంబ సభ్యులతో పాటు 102 ఏళ్ల బామ్మ కూడా కరోనా వైరస్ నుంచి కోలుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో ఆ బామ్మ ఎలాంటి ఆహారం తీసుకుని ఎలాంటి నిబంధనలు పాటించింది అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు. 
 
అయితే కరోనా బారిన పడిన తర్వాత... రాగి ముద్ద, బత్తాయి రసం, చికెన్, నాన్ వెజ్ వంటకాలు ఎక్కువగా తినే దానినని ... వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేసుకునేదాన్ని అంటూ ఆ బామ్మ అందరికీ హెల్త్ సీక్రెట్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments