Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి చేపలు కొనాలి? తెలుసుకోవడం ఎలా?

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (18:24 IST)
సహజంగా చేపలను మార్కెట్లలో కొంటుంటాం. కానీ కొన్నిసార్లు కొంతమంది బాగా నిల్వచేసిన చేపలను అమ్ముతుంటారు. అలాంటివి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. మరి చేపలు తాజాగా వున్నాయని తెలుసుకోవడం ఎలా?
 
చేపలను పట్టే జాలర్ల వద్ద చేపలను కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు చెపుతున్నారు. అలా కాకుండా మార్కెట్లకు వెళ్లినప్పుడు చేపలు తాజాగా వున్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చేపల మొప్పలను తీసి పరిశీలించవచ్చు. అవి ఎర్రగా వుండాలి. అలాగే చేపను చేతితో కాస్త నొక్కి చూస్తే మెత్తగా మీరు వేలు పెట్టినచోట గుంత పడుతుంటే అది బాగా నిల్వ వున్న చేప అని అర్థం చేసుకోవాలి.
 
చేపలు పట్టుకున్న తర్వాత ఐదు రోజులు తినదగినవిగా ఉంటాయి, కానీ అవి తాజాగా రుచిని కోల్పోతాయి. అందుకే చేపలు పట్టుకున్న వెంటనే ఐసులో పెట్టాలి. అలా పెట్టిన చేపలు డెలివరీ ద్వారా మార్కెట్‌కు అలాగే తేబడాలి. అప్పుడే అవి తాజాగా వుంటాయి.
 
ఇకపోతే చేపకు దుర్వాసన తీవ్రంగా ఉంటే అది తాజా చేప కాదు. తాజా చేపలు సముద్రపు నీటి వాసన వస్తుంటాయి. ఈ వాసనతోనే అవి తాజా చేపలను గుర్తించవచ్చు. కనుక ఈ టిప్స్ ద్వారా చేపలను తాజావి కొనుగోలు చేస్తే వండిన కూర కూడా రుచిగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments