Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొండ, బెండ కాయలను వేపుడు చేసుకోవాలంటే?

కాయగూరలు అధికంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అధికమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి కాయగూరనూ వండుకునే తినాలని లేదు. కొన్నింటిని సలాడ్ల రూపంలో.. పచ్చికూర ముక్కల్లా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (13:49 IST)
కాయగూరలు అధికంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అధికమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి కాయగూరనూ వండుకునే తినాలని లేదు. కొన్నింటిని సలాడ్ల రూపంలో.. పచ్చికూర ముక్కల్లా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా దోస, కీర, టమోటా, క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, క్యాప్సికం వంటివి ఇలా తీసుకోవచ్చు.
 
కూరగాయలను ఎక్కువ నీళ్లలో ఉడికించి, ఆ నీళ్లను వంచెయ్యటం కూడా సరికాదు. దానివల్ల ఫోలిక్‌ ఆమ్లం, కొన్ని రకాల ఖనిజాలు వృధా అవుతాయి. దొండ, బెండ వంటి కూరలతో వేపుడు చేసుకోవాలనుకుంటే చాలామంది నేరుగా వాటిని బాండీలో వేసి చాలాసేపు వేపుతుంటారు. దీనికంటే కూడా ముందు కొద్దిసేపు మైక్రోవేవ్‌లో ఉంచి, మెత్తబడిన తర్వాత కొద్దినూనెలో వేపుకోవచ్చు. దానివల్ల పోషక నష్టం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా క్యాబేజీ ఆకులు, గోబీ పువ్వు, పచ్చి బఠాణీ, బీన్స్‌ వంటివి ఒక్కసారి బాగా మరిగిన వేడి నీటిలో వేసి, రెండు నిమిషాలు ఉంచి, తీసుకోవచ్చు. కాయగూరలను ఎక్కువగా ఉడకబెట్టెయ్యటం, బాగా వేపుడులా చేసెయ్యటం మంచిది కాదు. దానివల్ల పోషక నష్టమే కానీ ఆరోగ్యానికి మేలు జరిగేదంటూ ఏమీ వుండదు. 
 
చిక్కుళ్లు, క్యారెట్లు, బీట్‌రూట్‌ వంటివి చాలామంది వేపుడు కూరల్లా నూనె వేసి చాలాసేపు వేయిస్తుంటారు. కానీ వాటిని ముందే ఒక్కసారి ప్రెజర్‌ కుక్కర్లో ఉడికించి, చాలా కొద్దినూనెలో తాలింపు పెట్టుకుంటే ఎక్కువ పోషకాలు పోకుండా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments