Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు..?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (15:46 IST)
కొందరింట్లో కొబ్బరి విపరీతంగా ఉంటుంది. కానీ, దానిని ఎలా భద్రపరచాలో తెలియక వృధాగా పారేస్తుంటారు. కొబ్బరి చెడిపోకుండా ఉండాలంటే.. ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగు పట్టదు. తేనె శుభ్రంగా నిల్వ ఉండాలంటే.. మంచి సీసాలో పోసి రెండు, మూడు లవంగాలు దానిలో వెయ్యాలి.
 
2. నాలుగైదు చుక్కుల నిమ్మరసం మాత్రమే అవసరమైనప్పుడు కాయను రెండు ముక్కలుగా కొయ్యవద్దు. సూదితో కాయకు రంధ్రం చేసి రసం పిండితే సరిపోతుంది. ఎండు కొబ్బరి సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి. 
 
3. పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. 
 
4. కారప్పొడిలో కాసిన్ని వేరుశెనగ గింజలను వేయించి పొడిగొట్టి కలుపుకుంటే.. ఇడ్లీలలోకి, దోశెలలోకి బాగుంటుంది. టీ, కాఫీల రుచి పెరగాలంటే.. డికాషన్‌లో నిమ్మకాయ చెక్క వేసుకోవాలి.
 
5. కొబ్బరికాయను ఖచ్చితంగా మధ్యకు పగుల కొట్టాలంటే.. కాయను కాసేపు నీళ్ళల్లో ఉంచి ఆ తరువాత కొట్టి చూడండి ఫలితం ఉంటుంది. ఈ కొబ్బరి చిప్పలు పసుపు పచ్చగా మారకుండా ఉండాలంటే.. వాటిని సీసాలో పెట్టి మూతపెట్టాలి. 
 
6. పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉండే.. ఓ బేసిన్‌లో వేడినీళ్లు పోసి.. తోడుకుని పెరుగు గిన్నెను ఆ నీటిలో ఉంచి.. మళ్లీ నీళ్ళను మరగపెడితే.. కొద్దిసేపట్లో గడ్డ పెరుగు తయారవుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments