దాల్చిన చెక్క టీని రోజూ సేవిస్తే.. బరువు తగ్గుతారట...

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటూ.. ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటుపడి శరీర బరువు పెరిగిపోతే.. ఆకుకూరలు, కాయకూరలు తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బరువు తగ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (13:05 IST)
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటూ.. ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటుపడి శరీర బరువు పెరిగిపోతే.. ఆకుకూరలు, కాయకూరలు తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు దాల్చిన చెక్కలో సాధారణ యాంటీ యాక్సిడెంట్లతో పోలిస్తే.. పాలీఫినాల్ అనే శక్తిమంతమైన పోషకం ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది.
 
ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తుంది. పరీక్షల సమయంలో, పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తాగే చాయ్‌లో కొద్దిగా దాల్చినచెక్క పొడి వేసుకుంటే మంచిది. ఇది మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.
 
అలాగే కొవ్వు సమస్యతో బరువు పెరిగిన వారు దాల్చిన చెక్క టీని రోజూ తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టే వాపూ, అలెర్జీల నుంచి ఈ టీ ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క పొడిని కొట్టుకుని ఓ బాక్సులో నిల్వ చేసుకోవాలి. ఆరునెలల పాటు చెడదు. 
 
ఇక చెక్క రూపంలోనే ఉంచితే ఏడాది పాటు దాని సుగుణాలు పదిలంగా ఉంటాయి. దీన్ని అచ్చంగా చాయ్‌లా చేసుకోవచ్చు లేదా మామూలు టీలోనూ కొద్దిగా కలుపుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఈ చాయ్‌ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. వేడి నీటిలో దాల్చిన చెక్క పొడిని కలిపి.. 5 నిమిషాల పాటు వేడి చేసి పటిక బెల్లం చేర్చి తీసుకుంటే.. బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

తల్లి బంగారన్ని తెగనమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి బైక్ కొనిచ్చిన ప్రియురాలు

పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక అవకతవకలు.. బాబుకు ఉండవల్లి లేఖ

భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత - త్వరలోనే రాజకీయ పార్టీ

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను మేం ఎంపిక చేస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

తర్వాతి కథనం
Show comments