Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు నచ్చే చికెన్ ఫ్రాంకీని ఎలా చేయాలి?

ముందుగా స్టఫింగ్‌కు సిద్ధం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేపాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి... పసుపు, గరంమసాలా, కారం, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, చాట్

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:29 IST)
పిల్లలకు నచ్చే చికెన్ ఫ్రాంకీని ఇంట్లోనే ఎలా తయారు చేయవచ్చో చూద్దాం.. బోలెడు పోషకాలుండే ఈ చికెన్ ఫ్రాంకీని పిల్లలు తీసుకోవడం ద్వారా వారికి మల్టీ విటమిన్స్ శరీరానికి అందుతాయి. 
 
కావలసిన పదార్థాలు: 
బోన్ లెస్ చికెన్ - అరకేజీ 
ఉల్లిపాయల తరుగు - అరకప్పు, 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ తరుగు - చెంచా,
టొమాటో ముక్కలు - అరకప్పు, 
ధనియాలపొడి - అరచెంచా,
చాట్‌మసాలా - చెంచా,
పసుపు - పావుచెంచా,
గరంమసాలా - అరచెంచా, 
కారం - అరచెంచా,
జీలకర్రపొడి - అరచెంచా, 
ఉప్పు - తగినంత,
నూనె - టేబుల్‌స్పూను, 
 
పిండిని ఇలా సిద్ధం చేసుకోవాలి..  
గోధుమ పిండి ఒక కప్పు, మైదా పిండి- అరకప్పును ఓ బౌల్‌లోకి తీసుకుని.. అందులో ఉప్పు, నూనె కాసింత చేర్చి.. ఐదు కోడిగుడ్లను అందులో కొట్టి పోసి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. 
 
తయారీ విధానం:
ముందుగా స్టఫింగ్‌కు సిద్ధం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేపాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి...  పసుపు, గరంమసాలా, కారం, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, చాట్‌మసాలా వేసేయాలి. ఇందులోనే తరిగిన చికెన్ ముక్కల్ని చేర్చాలి.  తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక తగినంత ఉప్పు వేసి దించి పక్కనబెట్టుకోవాలి. 
 
తర్వాత రోటీలు చేసుకోవాలి. చపాతీ పిండిలా తయారు చేసుకున్న పిండిని తీసుకుని పల్చని చపాతీలా వత్తి వేడి పెనంపై ఉంచాలి. అది కాస్త కాలాక చపాతీలను కాల్చి ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన చపాతీలను కూడా చేసుకుని పెట్టుకోవాలి. ఈ చపాతీలపై చికెన్ మిశ్రమాన్ని వుంచి.. రోల్స్ చేసి.. చిల్లీ సాస్, టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments