Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యాన్ని తెలుసుకోవడానికి యేసు దగ్గరకు వస్తే...

యేసు తన దగ్గరకు వచ్చే ఎవరినైనా తిరిగి పంపరు. దేవును రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసూనే రక్షకుడని హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకోవాలి. యేసు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో పాపాలను కడిగే శక్తి ఉన్నది. యేసుతో మాట్లాడి సత్యం తెలుసుకొన్నారు నికోదేము. ముస

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (11:28 IST)
యేసు తన దగ్గరకు వచ్చే ఎవరినైనా తిరిగి పంపరు. దేవును రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసూనే రక్షకుడని హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకోవాలి. యేసు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో పాపాలను కడిగే శక్తి ఉన్నది. యేసుతో మాట్లాడి సత్యం తెలుసుకొన్నారు నికోదేము. ముసలి వాడయినను చీకటిలో వచ్చి యేసు వాక్యపు వెలుగును పొందాడు. నికోదేము నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి అని పలికాడు.
 
ఆయన నిజంగా దేవుని ద్వారా సూచక క్రియలు చేస్తున్నారని నమ్మాలి. దేవుని రాజ్యంలో నికోదేము ప్రవేశించాలని ఆశతో యేసును విచారించడానికి వచ్చాడు. సమాజానికి భయపడి అధికారియైన నికోదేము రాత్రివేళ యేసు దగ్గరకు వెళ్ళాడు. యేసు బోధలను సూచక క్రియలను వ్యతిరేకించిన వారిలో నీకోదేము ఒకరు. అతడు మదాధికారియైనా సత్యం తెలియని వ్యక్తి. ఆ సత్యాన్నీ తెలుసుకోవడానికే యేసు వద్దకు వచ్చాడు.
 
విద్యావంతులలో చాలామంది అన్నీ తమకు తెలుసునని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం యేసు బోధనలలోనే దొరుకుతుంది. దానిని ఎలా నికోదేము అను అతడు రాత్రి యందు ఆయన యేసు యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవరును చేయలేరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు కడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
 
పరిసయ్యులు యూదా మత పెద్దలు. దేవుడు మోషేల ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారు. బాహ్య ప్రపంచానికి మాత్రం భక్తిపరులుగా కనిపిస్తారు. ధర్మశాస్త్రంలో, పాపంలో పట్టుబడిన వారని రాళ్ళతో కొట్టి చంపాలి. శరీరంలో ఏ భాగంతో పాపం చేస్తే ఆ భాగాన్నీ నరికేసేవారు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అలాంటి మత పెద్దలలో నికోదేము ఒకరు. యేసు చేసిన అద్భుతాలు, స్వస్థతలు చూసి ఆశ్చర్యపోయాడు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments