Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై రాజధాని కాలేజీ దశ తిరిగిందా?... 1,106 డిగ్రీ సీట్ల కోసం 95,136 దరఖాస్తులు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (13:32 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ప్రభుత్వ కాలేజీల్లో రాజధాని కాలేజీ ఒకటి. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ వంటి మహానుభావులు చదివిన కాలేజీ. ఇపుడు ఈ కాలేజీ దశ తిరిగిపోయింది. జాతీయ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్) ర్యాంకుల జాబితాలో వరుసగా మూడో యేడాది చోటు దక్కించుకుంది. 
 
దీంతో ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. ఫలితంగా 1,106 డిగ్రీ కోర్సుల్లోని సీట్లకు ఏకంగా 95,136 దరఖాస్తులు వచ్చాయి. గత యేడాది ఈ సంఖ్య 53,668 ఉన్నాయి. సాధారణంగా ఈ కాలేజీకి ప్రతి యేటా 30 వేల నుంచి 35 వేల దరఖాస్తులు వస్తుంటాయి. కానీ, ఈ దఫా సంఖ్య లక్ష వరకు చేరుకున్నాయి. 
 
ఇదే అంశంపై కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.రామన్ మాట్లాడుతూ, గత జూలై 5వ తేదీన జరిగిన కాలేజీ స్నాతకోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి, పూర్వవిద్యార్థి అయిన ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలేజీ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. దీనికితోడు కలైంజ్ఞర్ పేరుతో ఆడిటోరియంను నిర్మించినట్టు ప్రకటించారు. పైగా, కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. 
 
దీనికితోడు ఎన్.ఐ.ఆర్.ఎఫ్‌లో వరుసగా మూడో ర్యాంకును కైవసం చేసుకుందన్నారు. ఇది కాలేజీపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న దురాభిప్రాయాన్ని పోగొట్టిందని తెలిపారు. ఈ కారణంగానే ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తిని చూపుతున్నారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments