Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనను లైంగికంగా తృప్తి పరచడం లేదంటూ సినీ నటికి భర్త వేధింపులు

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (19:52 IST)
తన రెండో భర్త తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన చోటచేసుకుంది. మొగప్పైర్ తూర్పు ప్రాంతానికి చెందిన 39 సంవత్సరాల మహిళ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
సినిమాలు, టీవీ షోల్లో సపోర్టింగ్ కారెక్టర్లు చేస్తూ జీవనం గడుపుతోంది. దీంతోపాటు సొంతంగా యోగా క్లాస్‌లు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కొన్నాళ్ల క్రితం శివకార్తికేయన్ నటించిన మన్ కరాటే సినిమాలో నటిస్తున్న సమయంలో ఆమెకు శరవణన్ సుబ్రమణితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా రెండవ వివాహానికి దారి తీసింది. 
 
అయితే ఈమధ్య కాలంలో తన రెండో భర్త తన వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారని, బంగారాన్ని తీసుకెళ్లిపోయారని, తనను లైంగికంగా వేధిస్తున్నారని తిరుమంగళంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతడి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డ్యాన్స్ చేయాలంటూ తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. శరవణన్‌కి గతంలో ఆర్తి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కానీ ఆ విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టి తనను పెళ్లిచేసుకున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం