కారులో యువతిపై నలుగురు టెక్కీల అత్యాచారయత్నం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (11:43 IST)
చెన్నై నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక యువతిపై నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు. అదీ కూడా కదులుతున్న కారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో  రాత్రిపూట గస్తీ పోలీసులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఒక యువతి మరో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దురైప్పాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో టెక్కీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక నక్షత్ర హోటల్‌లో మందుపార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు పీకలదాకా మద్యం సేవించారు. 
 
ఆ తర్వాత తెల్లవారుజామున తమతమ ఇళ్లకు వెళ్లేందుకు అందరూ కలిసి ఒక కారులో బయలుదేరారు.  ఆ కారు హోటల్‌ను వీడి ప్రధాన రహదారి పైకి వెళ్లిన తర్వాత ఆ యువతిపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. దీంతో ఆ యువతి బిగ్గరగా కేకలు వేసింది. 
 
ఆ సమయంలో రోడ్లపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని గమనించి కారును, అందులోని టెక్కీలతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక థౌజండ్ లైట్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments