Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాలో టోపీ పెట్టిందని ఈ 'సినిమా'లోకి తీసుకొస్తారా.. జాగ్రత్తమ్మాయ్

ఆర్కేనగర్ పోటీకి సినిమాలో టోపీకి సంబంధం ఏమిటి? అంటే తప్పక ఉంది. మదరాసు పట్టణం చిత్రం ద్వారా నటిగా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విదేశీ భామ ఎమీ జాక్సన్ తన ప్రమేయం లేకుండా తమిళ రాజకీయాల్లోకి లాగబడుతోందని వార్తలు.

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (10:43 IST)
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు మొత్తంగా ఆర్కే నగర్ చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి నేపథ్యంలో ఆమె నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ప్రస్తుతం గెలుపు సాధించడానికి అధికారం పక్షం, పన్నీర్ సెల్వం పక్షం, దీపా పెరవై పక్షం, డీఎంకే పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం మీదే తమిళనాడు రాజకీయ పక్షాల భవితవ్యం మొత్తంగా ఆదారపడి ఉందనేంత రేంజిలో అక్కడ ప్రచారం జరుగుతోంది.
 
ఇదంతా బాగుంది కానీ ఆర్కేనగర్ పోటీకి సినిమాలో టోపీకి సంబంధం ఏమిటి? అంటే తప్పక ఉంది. మదరాసు పట్టణం చిత్రం ద్వారా నటిగా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విదేశీ భామ ఎమీ జాక్సన్ తన ప్రమేయం లేకుండా తమిళ రాజకీయాల్లోకి లాగబడుతోందని వార్తలు. ఆ సినిమాలో ఆమె పెట్టుకున్న టోపీ చాలా బాగుంటుంది. దినకరన్ గ్రూప్ పార్టీ అమ్మ అన్నాడీఎంకేకి ఎన్నికల సంఘం టోపీ గుర్తు కేటాయించిన దరిమిలా సినిమాలో టోపీ ధరించిన ఎమీ జాక్సన్‌ను ఎలాగోలా ఒప్పించి ప్రచారానికి తీసుకువచ్చినట్లయితే ఆమె టోపీని చూసి జనం తమకే ఓట్లేస్తారని శశికళ గ్రూప్ నుంచి పోటీ చేస్తున్న దినకరన్ ప్రగాడ విశ్వాసం. 
 
అమ్మ అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు టోపీనే కాబట్టి. దీంతో అలాంటి టోపీని పెట్టుకుని నటి ఎమీజాక్సన్‌ను తమ పార్టీ తరుఫున ప్రచారం చేయవలసిందిగా ఎమీజాక్సన్‌ను కోరినట్లు, అందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు కూడా కొలివుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రచారం చేయడం, చేయకపోవడం ఎమీజాక్సన్ ఇష్టమే కావచ్చు కానీ శశికళ మూలంగా ప్రతిష్ట దెబ్బతినిపోయిన అమ్మ అన్నాడీఎంకే తరపున ఎమీ ప్రచారానికి రావడం తప్పు సంకేతాలు వెలువరించే ప్రమాదముందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ హెచ్చరికలను పాటించడం, పాటించక పోవడం కూడా ఎమీ ఇష్టమే మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments