ఎల్ఐసీలో 9 వేల పోస్టుల భర్తీకి చర్యలు.. తెలుగు రాష్ట్రాల్లో 1408 పోస్టులు

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (14:25 IST)
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి)లో 9394 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 1408 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
 
గేశ వ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు రెగ్యులలర్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించనుంది. ఇందుకోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
2023 జనవరి ఒకటో తేదీ నాటికి అభ్యర్థుల వయో పరిమితి 21 యేళ్ల నుంచి 30 యేళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ల్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల పదో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సివుంటుంది. 
 
ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష, ఏప్రిల్ 8న మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.51500 నుంచి రూ.90205 వరకు వేతనంగా చెల్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments