యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల జాతర... వేతనం రూ.85 వేలు..

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (10:34 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్న అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నారి. వీటి భర్తీకి రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనుంది. 
 
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1500 పోస్టులను 2024-25 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాలని యూనియన్ బ్యాంక్ (యూబీఐ) నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని 200, తెలంగాణకు 200 పోస్టులను కేటాయించింది.
 
ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 24వ తేదీన ప్రారంభమైంది. ఆసక్తిగల యువతీయువకులు నవంబరు 13వ తేదీ వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. 
 
డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఇచ్చింది. అలానే ఓబీసీ కేటగిరికి చెందిన వారికి 3, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు వర్తిస్తుందని వెల్లడించింది.
 
దరఖాస్తు రుసుము విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు రూ.850లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు రుసుముగా కేవలం రూ.175లు చెల్లించాల్సి ఉంటుంది. జీతం రూ.48,480ల నుంచి రూ.85,920ల వరకు ఉంటుందని తెలిపింది. అర్హులైన అభ్యర్ధులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments