Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెఈఈ అడ్వాన్స్డ్ 2023లో అత్యద్భుతమైన ఫలితాలను సాధించిన కరీంనగర్‌ లోని ఇద్దరు ఆకాష్ బైజూస్ విద్యార్థులు

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (16:27 IST)
టెస్ట్ ప్రిపరేషన్ సేవలలో జాతీయ అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌, కరీంనగర్‌ లోని విద్యార్థులు ఇద్దరు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ) అడ్వాన్స్డ్ 2023లో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులతో పాటుగా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. ఈ ఇద్దరు విద్యార్థులలో వేముల సిద్ధార్ధ  1056 ర్యాంక్ సాధించగా, సంకిటి ఐశ్వర్య రెడ్డి 3683 ర్యాంక్ సాధించింది. ఈ ఫలితాలను ఐఐటీ గౌహతి నేడు విడుదల చేశారు. 
 
ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న జెఈఈలో విజయం సాధించేందుకు వీరు ఆకాష్‌ బైజూస్‌ ఇనిస్టిట్యూట్‌లో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్‌లో చేరారు. కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోవడంలో తాము పడిన కష్టం, లెర్నింగ్‌ షెడ్యూల్స్‌కు కట్టుబడి ఉండటమే తమ విజయానికి కారణంగా అభివర్ణించారు. ఆకాష్ బైజూస్ అందించిన కోచింగ్, కంటెంట్ తమ విజయానికి తోడ్పడ్డాయంటూ వారి శిక్షణ కారణంగానే అతి స్వల్ప కాలంలోనే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోగలిగామన్నారు. 
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ బైజూస్‌ రీజనల్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను అభినందిస్తున్నాను. వారు పడిన కష్టం, అంకితభావం మరియు వారి తల్లిదండ్రులు అందించిన మద్దతు గురించి ఈ ఫలితాలు ఎంతో వెల్లడిస్తాయి. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. మొత్తం మీద 1.8 లక్షల మంది విద్యార్థులు జెఈఈ (అడ్వాన్స్డ్) 2023 కోసం హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments