Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు నమ్మితే బలంగా దిగండి. వెనక్కి లాగే వాళ్ళ కోసం పట్టించుకోవద్దు : నేచురల్ స్టార్ నాని

nani
, గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:43 IST)
nani
నేచురల్ స్టార్ నాని యువతకు ఉద్భోద చేశారు. ‘దసరా’ మార్చి 30న విడుదలైంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్ ని కానుకగా ఇచ్చారు.
 
నాని మాట్లాడుతూ.. సినిమా ఇంకా మొదలుకాకముందు ‘’నాని అన్న లాంటి యాక్టర్ కి వంద కోట్ల పోస్టర్ చూడాలని కోరికగా వుంది’’అని శ్రీకాంత్, మా కో డైరెక్టర్ వినయ్ తో అన్నాడు. ఆ కోరిక ఈ వేదికపై తీరింది. ఈ వేడుక కరీంనగర్ లో జరగడం మా అందరికీ మెమరబుల్. దసరాని థియేటర్ లో ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మేము చూశాం. మా కడుపునిండిపోయింది. నేను నాకు తోచింది మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. ఈ ప్రోసస్ లో నిరాశ పరిచిన వారు కూడా కొంతమంది వుంటారు. కానీ బలంగా నమ్మి మనస్పూర్తిగా దిగిపోయేవాడిని. నేను అలా దిగిపోయిన ప్రతిసారి మీరు సపోర్ట్, విజయాలు ఇచ్చి ఇంత గొప్పగా ప్రోత్సహిస్తుంటే ఆ నమ్మకం పదింతలైపోయింది. మీ అందరికీ కలలు వుంటాయి. మీరు నమ్మితే బలంగా దిగండి. వెనక్కి లాగే వాళ్ళ కోసం పట్టించుకోవద్దు. ప్రాణం పెట్టి పని చేయండి. మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి. మీడియా,  సోషల్ మీడియాలో ఒక కొత్త సినిమా విడుదలౌతుంటే ఇది బాగా ఆడితే బావుటుందని అనుకునే వారి కంటే, ఇది ఆడదని అనే వాళ్ళే ఎక్కువ వున్నారు. వాళ్ళందరిది తప్పు అని నిరూపించాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద ఈ రోజు మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా అంటేనే చెడు మీద మంచి గెలవడం. ఈ రోజు ఆ వేడుక కరీంనగర్ లో జరుపుకుంటున్నాం. ఈ గెలుపు శ్రీకాంత్ ఓదెలది, సుధాకర్ చెరుకూరిది, సంతోష్ నారాయణది, నవీన్ నూలిది, అవినాస్ ది, దసరా టీంలో పని చేసిన అందరిదీ, ఈ గెలుపు ప్రేక్షకులందరిది. మీరంతా ఇంత గొప్పగా ఆదరించకపోయి వుంటే మేము పెట్టిన కష్టానికి ఫలితం వుండేది కాదు. మరోసారి ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.  దసరా గురించి గొప్పగా పోస్టులు పెట్టి మీ అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మరోసారి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్.. గబ్బర్ సింగ్‌‌ను తలపించాడు..