Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెర్చ్ ఇంజిన్‌నే మెప్పించిన తెలుగు బిడ్డ.. రూ.1.20 కోట్ల వేతనం...

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్. అలాంటి సంస్థనే ఓ యువతి మెప్పించింది. ఆ యువతి ఎవరో కాదు. మన తెలుగు బిడ్డ. అదీ కూడా తెలంగాణ యువతి. ఇపుడు ఈ యువతి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (10:37 IST)
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్. అలాంటి సంస్థనే ఓ యువతి మెప్పించింది. ఆ యువతి ఎవరో కాదు. మన తెలుగు బిడ్డ. అదీ కూడా తెలంగాణ యువతి. ఇపుడు ఈ యువతి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికికారణం.. ఆ యువతికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్ ఉద్యోగం కల్పించింది. ఇంతకీ ఈ బంపర్ ఆఫర్ కొట్టిన అమ్మాయి పేరు కుడుగుంట స్నేహారెడ్డి. హైదరాబాద్‌లోని వికారాబాద్‌వాసి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసింది. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది.
 
ఇంతలో 'నేచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్' ప్రాజెక్టులో పనిచేసేందుకు గూగుల్ మెరికల్లాంటి యువత కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న స్నేహారెడ్డి దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్‌లో జరిగిన తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక చిట్టచివరి పరీక్ష కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా, అదేసమయంలో మరో ముఖ్యమైన పరీక్ష ఉండడంతో వెళ్లలేకపోయింది. 
 
అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన గూగుల్ ఆ ముఖ్యమైన పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించింది. అందులో స్నేహా రెడ్డి సులభంగా ఉత్తీర్ణత సాధించింది. అంతే ఆమెను తమ సంస్థలో పనిచేసే ప్రతిభావంతుల జాబితాలో గూగుల్ కంపెనీ చేర్చింది. స్నేహారెడ్డితో పాటు మరో నలుగురిని గూగుల్ ఎంపిక చేసింది. వీరిలో ఒక్కొక్కరికీ రూ.1.20 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments