Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి వేద విజ్ఞాన పీఠాల్లో అడ్మిషన్లు - దరఖాస్తుకు ఆఖరు తేదీ జూన్ 15

Webdunia
మంగళవారం, 16 మే 2023 (16:40 IST)
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం పూర్తిచేసుకున్న బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. వేద సంబంధిత కోర్సులకు నిర్దేశించిన ప్రకారం వయసు, విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు టీటీడీ వెబ్‌‍సైట్స్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని భర్తీ చేసి తాము చేరదలచుకొన్న వేద విజ్ఞాన పీఠానికి పంపుకోవాలి.
 
ఎస్.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల
ఎస్.వి. సంస్కృత వేద పాఠశాల, కీసరగుట్ట, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా
ఎస్.వి. వేద పాఠశాల, ఐ.భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
ఎస్.వి. వేద పాఠశాల, శ్రీమత రామాయణ ప్రాంగణం, రామనారాయణ సారిక దగ్గర, విజయ నగరం జిల్లా
ఎస్.వి. వేద పాఠశాల, ఎ.ఎం.ఆర్.ఎస్.ఎల్.బీ.సీ క్యాంపస్, పానగల్, రామగిరి, నల్లగొండ జిల్లా 
ఎస్.వి. వేద పాఠశాల, శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, కోటప్పకొండ, గురవాయపాలెం పోస్టు, వయా సాతులూరు, నర్సరావుపేట, గుంటూరు జిల్లా
 
బోధించే కోర్సులు : రుగ్వేదం (శాకల శాఖ), శుక్ల యజుర్వేదం (కాణ్వ శాఖ), కృష్ణ యజుర్వేదం (తైత్తిరీయ శాఖ), సామవేదం (కౌథుమ శాఖ), సామవేదం(జైమినీయ శాఖ), సామవేదం (రాణాయనీయ శాఖ)
కోర్సుల వ్యవధి పన్నెండేళ్లు, కృష్ణ యజుర్వేదం (మైత్రా యణీయ శాఖ), అధర్వణ వేదం (శౌనక శాఖ) కోర్సుల వ్యవధి ఏడేళ్లు. వీటికి అయిదోతరగతి ఉత్తీర్ణులైన బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 10 నుంచి 12 యేళ్ల మధ్య ఉండాలి. 
 
దివ్య ప్రబంధం, వైఖానసా గమం, పాంచరాత్రాగమం, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, తంత్రసార ఆగమం, రుగ్వేద స్మార్తం (ఆశ్వ లాయన), శుక్ల యజుర్వేద స్మార్తం (పారస్కర), కృష్ణయ జుర్వేద స్కారం(ఆపస్తంబ), వైఖానస స్కారం, అప స్తంబ పౌరోహిత్యం(స్మార్తం), బోధాయనీయ పౌరో హిత్యం(స్మార్తం) కోర్సుల వ్యవధి ఎనిమిదేళ్లు. కనీసం ఏడోతరగతి ఉత్తీర్ణులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ కోర్సులన్నింటికీ  జూన్ 15వ తేదీ లోపు దరఖాస్తులను చేరవేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments